¡Sorpréndeme!

కోడెల శివ ప్ర‌సాద్ మీద వేటు వేయాలంటున్న టీడీపీ నేతలు || Oneindia Telugu

2019-08-07 1,539 Dailymotion

Sattenapalli TDP leaders complaint On ex speaker Kodela Siva Prasad to Party Chief Chandra babu. They demand to take action On Kodela and change constituency in charge.
#appolitics
#tdp
#kodelasivaprasad
#guntur
#chandrababu
#Sattenapalli
#Narsaraopet

టీడీపీ సీనియ‌ర్ నేత..మాజీ స్పీక‌ర్ కోడెల శివ ప్ర‌సాద్ మీద వేటు త‌ప్ప‌దా. ఇప్ప‌టి వ‌ర‌కు కోడెల టాక్స్ పేరుతో వ‌స్తు న్న ఆరోప‌ణ‌లు..పోలీసు కేసులు..ముంద‌స్తు బెయిల్ వ్య‌వ‌హారాల‌తో త‌ల‌బొప్పి కట్టిన కోడెల‌కు ఇప్పుడు సొంత పార్టీ నేత‌ల నుండే అసమ్మ‌తి మొద‌లైంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో మొద‌లైన సొంత పార్టీ నేత‌ల వ్య‌తిరేక‌త ఇప్పుడు మ‌రో సారి నేరుగా పార్టీ అధినేత వ‌ద్ద‌కు చేరింది. అనేక ఆరోప‌ణ‌లు..వ‌సూళ్ల‌తో పార్టీ ప్ర‌తిష్ట దిగ‌జార్చార‌ని అటువంటి నేత ఆధ్వ‌ర్యంలో తాము ప‌ని చేయ‌టానికి సిద్దంగా లేమంటూ స‌త్తెన‌ప‌ల్లి లోని కోడెల వ్యతిరేక వ‌ర్గం టీడీపీ రాష్ట్ర కార్యా ల‌యం వ‌ద్ద ధ‌ర్నా చేసింది. కోడెల‌పైన వేటు వేయాల‌ని డిమాండ్ చేసింది.